తాండూరు ప్రజల సేవ కోసమే శుభప్రద్‌ పటేల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌

 ప్రతి గ్రామానికీ ట్రస్ట్‌ సేవలు విస్తరిస్తాం
 చైర్మన్‌ శ్రీవాణి శుభప్రద్‌ పటేల్‌
నవతెలంగాణ-తాండూరు
తాండూర్‌ ప్రజల సేవ కోసమే శుభప్రద్‌ పటేల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ పని చేస్తోందని ట్రస్ట్‌ చైర్మన్‌ శ్రీవాణి శుభప్రద్‌ పటేల్‌ తెలిపారు. తాండూరు పట్టణ కేం ద్రంలోని శివాజీ చౌక్‌ మల్‌ రెడ్డిపల్లి రోడ్డులో శుభ ప్రద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయాన్ని ఆమె ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొంత కాలంగా శుభప్రద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలు చేస్తోందని ట్రస్ట్‌ సేవలకు తాండూర్‌ వ్యాప్తంగా మం చి స్పందన వస్తోందన్నారు. ఈ సందర్భంగా శుభప్ర ద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయం ఏర్పాటు చేసు కున్నామన్నారు. తాండూర్‌ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ట్రస్ట్‌ పని చేస్తోదని ప్రతి గ్రామానికీ శుభప్రద్‌ పటేల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలు, కార్యక్రమా లు విస్తరిస్తామన్నారు. విద్యారర్థులను, యువకులకు ప్రోత్సాహించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ట్రస్ట్‌కు సహకారం అందిస్తున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. శుభప్రద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ మాట్లాడు తూ.. శుభప్రద్‌ పటేల్‌ 20 ఏండ్లుగా ప్రజా జీవితం లో కొనసాగుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పా త్ర పోషించారన్నారు. తాండూర్‌ ప్రాంత అభివృద్ధి కో సం అహర్నిశలు కృషి చేస్తున్నారని శుభప్రద్‌ పటేల్‌ స్పూర్తితోనే ట్రస్ట్‌ను కొనగిస్తామన్నారు. కార్యక్రమం లో శుభప్రద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి భాను ప్రసాద్‌, కోశాధికారి హరీష్‌, సభ్యులు కుర్వ బా లు, చెన్నారం చారీ, చందు, శ్రీశైలం, విజరు, ప్రశాం త్‌, చౌష్‌ భారు, జావీద్‌ లాల, నరేష్‌ గౌడ్‌, విజరు, రాము గౌడ్‌, వెంకట్రాములు, వాజీద్‌, మొయిజ్‌, ప్ర శాంత్‌, జగదీశ్వర్‌, నర్సిములు, వెంకట్‌ రెడ్డి, రామ్‌ రెడ్డి, సాయి, గణేష్‌, అఖీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.