ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతి ..

Subhash Chandra Bose Jayanti in Govt Degree College..నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు.  ఈ సందర్బంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు కేకే. వినయ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. విజయ్ కుమార్ లు మాట్లాడుతూ సుభాష్ చంద్ర బోస్ ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ (INA) అనే సంస్థను ఏర్పాటు చేసి, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేసారన్నారు. ఆయన ఉద్ధేశ్యం స్వతంత్రత సాధించడం మాత్రమే కాక, భారతదేశం యొక్క ప్రజల హక్కులను రక్షించడం కూడా అన్నారని పేర్కొన్నారు. దేశం కోసం మీరు రక్తాన్ని ఇవ్వండి నేను స్వతంత్రాన్ని తెస్తాను అన్న  ప్రసిద్ధ నినాదంతో ఆయన భారతీయుల మధ్య ఆత్మగౌరవం, దేశభక్తిని కలిగించారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ దేశం కోసం జై హింద్!” అన్న నినాదం ద్వారా ఆయన భారతదేశంలో మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. సైనిక జాతి కోసం తమ ప్రాణాలను త్యజించే తపన, ఆయన దేశభక్తి, భారతదేశానికి తిరుగులేని పోరాటం చేయాలని ఉత్తేజం కల్పించాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిష్టయా, గంబీర్ , ఎన్ సి సి ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ఇంచార్జ్ చంద్రశేఖర్, కవిత మేడం మీరా మేడం, విద్యార్ధి సేన నాయకులు హరి కృష్ణ, రాహుల్,  ఎన్ సి సి విద్యార్థులు పాల్గొన్నారు.