నీటి మునిగిన ఎస్టీ కాలనీ

ST colony under water– ఆందోళనలో గిరిజనులు
నవ తెలంగాణ-మల్హర్ రావు
గురువారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని పెద్దతూశీడ్ల గ్రామంలోని (నాయకపు వాడ) ఎస్టీవాడలో భారీగా నీరు చేరి రోడ్లు జలమయం అయ్యాయి.డ్రైనేజీల్లో చెత్తజ,చెదారం ఉండటంతో నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఇండ్లలోకి నీరు చేరడంతో గిరిజనులు భయాందోళనకు గురివుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు పట్టించుకోని రోడ్లపై వెళుతున్న నీటిని డ్రైనేజీల ద్వారా బయటకు వెళ్లేలా చూడాలని లేదంటే ఇండ్లలోకి భారీగా నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు.