చైర్మన్ కి వినతి పత్రం అందజేత..

Presenting the petition to the chairman..– వెదురు ఉత్పత్తుల మీద,అల్లికల మీద నిషేధం ఎత్తివేయాలని డిమాండ్
నవతెలంగాణ – జన్నారం
వేదురు ఉత్పత్తులు  మీద అల్లికల మీద నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ కోట్నాక  తిరుపతికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని  పిడిఎస్యు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు  ప్రభంజనం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెదురు ఉత్పత్తులను అల్లికలను ఫారెస్టు అధికారులు నిర్బంధిస్తున్నారని వాటి మీద ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టైగర్ జోన్ నీ వెంటనే రద్దుచేసి ఇక్కడ ప్రజలకు రక్షణ కల్పించవలసిందిగా డిమాండ్ చేశారు. పోడుమములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి అని కోరారు. విద్య వైద్యం అందకుండా ఉన్న మారుమూల ఆదివాసిగూడల మీద ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. అడవిలో వెదురు సేకరణ కోసం వెళ్లే వారి మీద ఫారెస్ట్ అధికారుల దాడులను నిలిపివేయాలని కోరారు. చెక్ పోస్ట్ ల వద్ద ఫారెస్ట్ అధికారులు వెదురుతో చేసిన అల్లికలను పట్టుకొని సీజ్ చేస్తున్నారని, చలాన్ వేస్తున్నారని వెదురు నిషేధ పదార్థం కాదు అని, కాబట్టి వెదురు అల్లికలను ఆపకూడదు అని తెలిపారు .వెదురు ఉత్పత్తుల మీద ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి రుణాలు మంజూరు చేయవలసిందిగా కోరారు. అంతరించిపోతున్న వెదురు జాతి కళ రూపాలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది అని స్పష్టం చేశారు.