మండలంలోని చింతలూరు గ్రామంలో హైస్కూల్ కు అదే గ్రామానికి చెందిన సి ఏ నాగుల ప్రశాంత్ రూ.50 వేల విలువగల కంప్యూటర్ స్కానర్ ప్రింటర్ అందజేసినట్లు కొలి ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్ తెలిపారు. దినోత్సవం సందర్బంగా నాగుల ప్రశాంత్ చార్టెడ్ అకౌంట్ గా పని చేస్తూ, జడ్పిహెచ్ఎస్ చింతలూరు కు రూ.50000/- యాభై వెయ్యిల విలువ గల కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, నాగుల సుజిత్ చేతుల మీదుగా ప్రధాన ఉపాధ్యాయులు లచ్చన్న కి అందచేయడం జరిగింది. ఇందుకు గాను వారికి శీరస్ వంచి నా తరపున గ్రామ యువకుల తరపున గ్రామ ప్రజల తరుపున ధన్యవాదములు తెలుపుతున్నామని కొలి ప్యాక్ సింగిల్ విండోస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్ తెలిపారు.