నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్, బిచ్కుంద రెండు మండలాల జీపీ కార్మీకుల అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతు జుక్కల్ ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ తోట ను కలిసి సీఐటీయూ జిల్లా కార్యవర్గ సబ్యుడు సురేష్ గొండ అధ్వర్యంలో డిమాండ్లతో కూడీన వినతి పత్రం ను అందించారు. బుదువారం నాడు జుక్కల్ ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా కార్యవర్గ సబ్యుడు సురేష్ గొండ కార్మీకులనుద్దేశించి మాట్లాడుతు జీపీ కార్మీకులందరికి ప్రభూత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం ఇరువై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సురెన్స్ సౌకర్యాలతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. కార్మీకులందరికి డబుల్ బెడ్ రూం లు ఇవ్వాలని దాదాపుగా ఐదారు నెలలుగా వేతనాలు కూడా ఇవ్వలేదని డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతు జీపీ కార్మీకుల సమస్యలన్నింటికి రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని హమీ ఇస్తున్నాని ఎమ్మెలే తెలిపారు. ఎమ్మెలేను సన్మానించిన జీపీ కార్మీకులు:- ఎమ్మెలే క్యాంప్ కార్యాలయంలో కలిసిన జీపీ కార్మీకులు ఎమ్మెలే గెలిచిన అనంతరం మెుదటి సారిగా కార్మీకులతో కలవడంతో జుక్కల్, బిచ్కుంద రెండు మండలాల జీపీ కార్మీకుల ఎమ్మెలేను కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్, బిచ్కుంద రెండు మండల గ్రామ పంచాయతి సఫాయి కార్మీకులు గోవింద్, వీరయ్య, గంగారాం, ఙ్ఞానేశ్వర్, సాయులు, శంకర్, లింగురామ్, లక్ష్మన్, జలీల్ తదితరులు పాల్గోన్నారు.