నవతెలంగాణలో చందాదారులుగా చేరండి

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు
బి మధుసూదన్‌ రెడ్డి
యాచారం మండల కేంద్రంలో పేపర్‌ క్యాంపెయిన్‌
నవతెలంగాణ-యాచారం
సమాజంలో సమాజంలో ప్రతి ఒక్కరూ నవ తెలంగాణ దినపత్రిక చందాదారులుగా చేరాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి మధుసూదన్‌ రెడ్డి కోరారు. సోమవారం యాచారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) నాయకులు నవ తెలంగాణ దినపత్రిక చందాదారుల పేపర్‌ క్యాంపెయిన్‌్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవతెలంగాణ ఎల్లప్పుడు ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పత్రిక వారధిగా పనిచేస్తుందని చెప్పారు. సమాజంలో నవ తెలంగాణ దినపత్రిక శాస్త్రీయ, సామాజిక రంగాల్లో ఎక్కువగా పనిచేస్తుందని పేర్కొన్నారు. నవతెలంగాణను చదివి చందాదారులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పి అంజయ్య, అమీర్పేట మల్లేష్‌, పాల్గొన్నారు.