నవతెలంగాణ దినపత్రికలో చందాదారులుగా చేరండి

– సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం నియోజక వర్గ కన్వీనర్‌ పగడాల యాదయ్య
నవతెలంగాణ-మంచాల
నవతెలంగాణ దినపత్రికలో చందాదారులుగా చేరాలని సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కన్వీనర్‌ పగడాల యాదయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అంబోత తండా గ్రామంలో నవతెలంగాణ దినపత్రిక సర్య్కూలేషన్‌ క్యాంపెన్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రచురించే పత్రిక నవతెలంగాణ దినపత్రిక అని తెలిపారు.ఈ పత్రికలో ఏడాది చందాకు రూ.2 వేలు, ఆరు నెలలకు రూ.వేయ్యి, హౌటల్స్‌, గ్రంథా లయం, స్కూల్స్‌, హేర్‌ కటింగ్‌ షాపులకు ఏడాదికి రూ.1200 లు చెల్లించి చందాదారులుగా చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు సిలివేరు రాజు, బొడకొండ శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్‌, అంబోత తండా శాఖ కార్యదర్శి రవీందర్‌, ముక్కం దాసు, కొర్ర రవి నాయక్‌, తదితరులున్నారు.