– ఎఫ్ పి ఓ చైర్మన్ చాట్ల గోపాల్ పిలుపు
నవతెలంగాణ – మద్నూర్
నేషనల్ సీడ్ కంపెనీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈనెల 30న ఉదయం 9 గంటలకు మద్నూర్ మండల కేంద్రంలోని ఎఫ్ పి ఓ కార్యాలయంలో నిర్వహించబడే విత్తనాశుద్ధి అవగాహన సదస్సుకు ఇటీవల శనగ విత్తనాలు సబ్సిడీ పొందిన రైతులు మాత్రమే ఈ అవగాహన సదస్సుకు హాజరుకావాలని ఎఫ్ పి ఓ చైర్మన్ చాట్ల గోపాల్ బుధవారం ఉదయం నవతెలంగాణతో మాట్లాడుతూ తెలిపారు. వ్యవసాయ రైతులు విత్తనాలు ఏ రకంగా ఉంచాలి అనే దానిపై విత్తన శుద్ధి అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. రైతులకు అవగాహన కల్పించడానికి హైదరాబాదులోని నేషనల్ సీడ్ కంపెనీ వారు వస్తున్నట్లు వీరితోపాటు మండల వ్యవసాయ అధికారి హాజరవుతారని ఆయన తెలిపారు. శనగ విత్తనాలు సబ్సిడీ పొందిన రైతులంతా ఈ అవగాహన సదస్సు హాజరై విత్తన శుద్ధిపట్ల తెలుసుకోవాలని ఆయన కోరారు.