నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబి నేషన్‌లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ తర్వాత వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నేడు (శుక్రవారం) థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌ని నిర్వహించి, చిత్ర విజయం పట్ల వారికున్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. చిత్ర సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ, ”నాగశౌర్య, మాళవికల సహజమైన నటన కోసం ఈ సినిమా చూడొచ్చు. శ్రీనివాస్ ఆయన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఎంతో హద్యంగా రూపొందించారు. కళ్యాణి మాలిక్ సంగీతానికి ఇప్పటికే విశేష స్పందన లభించింది. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. విజయోత్సవ సభలో మళ్ళీ కలుద్దాం’ అని అన్నారు. ‘ఇంత మంచి చిత్రంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు విశ్వకి, వివేక్‌కి కతజ్ఞతలు’ అని నిర్మాత దాసరి ప్రసాద్ చెప్పారు.