ధనుష్ నటించిన తన 50వ చిత్రం ‘రాయన్’. దీనికి ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని, ప్రొడ్యూసర్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ,’నేను చాలా లక్కీ. నా కెరీర్లో చాలా మంచి ఫిలిం మేకర్స్‌తో కలిసి పని చేసే అవకాశం దొరికింది. సెల్వ రాఘవన్, సుబ్రహ్మణ్యం శివ, భూపతి పాండియన్, వెట్రిమారన్.. ఇలా నాతో సినిమాలు చేసిన దర్శకులందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా కెరీర్లో నేను నా తప్పుల నుంచే ఎక్కువ నేర్చుకున్నా. అందుకే మనం చేసే మిస్టేక్స్‌కి థ్యాంక్ ఫుల్‌గా ఉండాలి. డైరెక్షన్ చాలా భాద్యతతో కూడుకున్నది. నాకు నటనపైన ఎంత ఇష్టం ఉందో దర్శకత్వంపైనా అంతే ఇష్టం ఉంది. నేను డైరెక్షన్ చేసిన ఈ సినిమా ఈనెల 26న వస్తోంది. ఇదొక బ్లెసింగ్‌గా భావిస్తున్నాను. నిర్మాత కళానిధి మారన్, ఎఆర్ రెహ్మాన్, ప్రకాష్ రాజ్, ఎస్జే సూర్య, సందీప్, అపర్ణ, నా టెక్నికల్ టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నన్ను ఎంతగానో అభిమానించే తెలుగు ఆడియన్స్‌కి ధన్యవాదాలు. నా నుంచి కోరుకునే మంచి డైలాగ్స్, యాక్షన్, సాంగ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’ అని అన్నారు.