మూడు జిల్లాల మహాసభను విజయవంతం చేయండి:  లాయక్ పాషా

నవతెలంగాణ – వేములవాడ 
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టి యు డబ్ల్యూ జే హెచ్ 143 మూడు జిల్లాల మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ లు పిలుపునిచ్చారు. శనివారం వేములవాడ పట్టణంలోని ఆహా ఫుడ్ కోర్టు మీటింగ్ హల్ లో  కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల,  జగిత్యాల జిల్లాలకు చెందిన జర్నలిస్టులు మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మహాసభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ తో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు  హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొలిపాక నర్సయ్య,  కనకారెడ్డి,  జిల్లా రమేష్, కొత్వాల్ శ్రీనివాస్, మహమ్మద్ అజీమ్, నేరెళ్ల  కమలాకర్, సిహెచ్  దేవరాజు,పండుగ స్వామి, షేక్ రియాజ్,  సంటి రాజేందర్, దుర్గం పరశురాం,  ప్రవీణ్, సయ్యద్ ఫహద్ పాషా, కోడం గంగాధర్, శ్రీకాంత్, హరీష్, షోయబ్, శ్యామ్, నయీం,ముషాహిద్, ఇమ్రాన్, షబ్బీర్, జునైద్, జబ్బర్, నాగరాజు, గంగాధర్ లతోపాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.