సైన్స్ దినోత్సవాన్ని విజయవంతం చేయండి: జిల్లా అధ్యక్షులు కోయేడి నర్సింలు

నవతెలంగాణ – నవీపేట్: జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28 ని పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో  మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేబీవీ జిల్లా అధ్యక్షులు కోయేడ నర్సింలు మాట్లాడుతూ సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు విజ్ఞాన సమాజాన్ని రూపొందించడం కోసం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థుల ఆలోచనలో మార్పు తీసుకువచ్చేందుకు సైన్స్ పై అవగాహన కోసం ఉపన్యాస, వ్యక్తిత్వ పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రాజ్ కిషన్ రాజశేఖర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.