
చౌటుప్పల్ పట్టణ కేంద్రం వలిగొండ రోడ్డులోని 113,114 సర్వే నెంబర్లలో గత కొంత కాలంగా భూ కబ్జాదారులు కోట్ల విలువైన భూమిని ఆక్రమించాలని విశ్వప్రయత్నాలు చేస్తుండగా స్థానిక చౌటుప్పల్ వర్కింగ్ జర్నలిస్టులు గత ఆర్డిఓ జగన్నాధ రావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి సర్వే చేసి హద్దులు నిర్ణయించి కడిరాల్లను నాటించడం జరిగింది.అలా జరిగిన మూడు రోజులకే రాత్రికిరాత్రే భూకబ్జాదారులు కడిరాళ్లను తొలగించి ఆ భూమిని ఆక్రమించాలని ప్రయత్నం చేయగా స్పందించిన చౌటుప్పల్ వర్కింగ్ జర్నలిస్టులు అట్టి భూమిలో దీక్ష శిబిరాన్ని వేసి రిలే నిరాహార దీక్షలను చేపట్టారు.ఈ విషయాన్ని పత్రికల ద్వారా,అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్ వరకు తీసుకు వెళ్ళటం జరిగింది.వర్కింగ్ జర్నలిస్టులు వేసిన దీక్ష శిబిరాన్ని కూడా గుట్ట చప్పుడు కాకుండా అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు.ప్రభుత్వ భూమిని కాపాడాలని అనేకమంది కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు.అయినా కానీ అధికారుల ఆదేశాలను ధిక్కరించి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుండగా ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ చౌటుప్పల్ వర్కింగ్ జర్నలిస్టులు చేసిన రిలే నిరాహార దీక్షలు ప్రభుత్వ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన అధికారులు ఆ సర్వే నెంబర్లలోని అక్రమ కట్టడాలను మంగళవారం కూల్చివేయడం జరిగింది.ఇదంతా కూడా జర్నలిస్టులు చేసిన దీక్ష విజయ ఫలితమే.ఇట్టి విజయంలో పాలుపంచు కున్న చౌటుప్పల్ వర్కింగ్ జర్నలిస్టులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.ఇకపై ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమిం చిన జర్నలిస్టులు ప్రభుత్వ భూములను కాపాడడానికి సిద్ధంగా ఉంటారని చౌటుప్పల్ జర్నలిస్టులు నిరూపించారు.ప్రభుత్వ భూములను ప్రజా ఉపయోగాల కోసమే ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నారు.