విజయోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి 

Success program should be successful– జిల్లా కలెక్టర్ ఎం మన్ చౌదరి 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఈనెల 25 సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సాంస్కృతిక కళా ప్రదర్శన  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ఈ ప్రత్యేక సాంస్కృతిక  కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సీనియర్ కళాకారులు అంతడుపుల నాగరాజు బృందం 80 మంది సభ్యులు 35 మంది మహిళలు 45 మంది పురుషులు గల కళాబృందం పాల్గొంటారని, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక కళా ప్రదర్శన చేస్తారని అన్నారు. కళా ప్రదర్శన కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీక్షకుల కోసం  ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కళా ప్రదర్శన  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.