ప్రజాసంఘాల మహా ధర్నాను విజయవంతం చేయండి

నవతెలంగాణ-భిక్కనూర్
రాజంపేట మండల కేంద్రంలో జరిగిన పోడు రైతుల సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు మాట్లాడుతూ ఈనెల 10 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడా బాబుల బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగే ధర్నాలు, రైతులు, కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. దేశంలో ఉన్న పెట్టుబడి దారుల కోసం పేద ప్రజలను దోచి పెద్దల కడుపు నింపడానికి బడ్జెట్ ప్రవేశపెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు చేయాలని ప్రతి వ్యవసాయ కార్మికునికి 12 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. పోడు రైతులకు పక్క పత్రాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలిచ్చి ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిపాల్, వినోద్, మున్ని, సంజీవులు, తదితరులు పాల్గొన్నారు.