మూలం సంతను విజయవంతం చేయండి..

May the origin be successful..– జై జవాన్, జై కిసాన్ నినాదంతో ముందుకు ..
– రైతులకు చేతివృత్తుల వారికి చేయూత
నవతెలంగాణ – పెద్దవూర
గ్రామ భారతి 28 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన గ్రామ భారతి,సీఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ లోని తార్నాక లోని మర్రి కృష్ణా హల్ నందు మూల సంత ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలంగాణ గ్రామ భారతి రాష్ట్ర అధ్యక్షురాలు సూర్య కళ శుక్రవారం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ పెద్దవూరలో నవతెలంగాణతో మాట్లాడారు. రైతులు, చేతివృత్తులు, విలువజోడింపు చిరు ఉత్పత్తిదారులు నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటానికి ప్రత్యేక వేదిక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.గత నెలలో కూడా మూల సంత ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రకృతి, పాడి, సాహిత్యం, ఆయుర్వేద, పంచగవ్య, కుల వృత్తులు, చేతి వృత్తులు ఇతరత్రా వారిని ప్రోత్సహిస్తూ జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున అందరూ కుటుంబసమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని మరలా విజయవంతం చేయగలరని తెలిపారు. ఈ సంతలో ఆరోగ్య కరమైన మిల్లట్ ఆహారం, నోరురించే మిల్లెట్, ఐస్ క్రీమ్, గోమయ రాఖీలు, ప్రమిదలు, పేంట్ పుట్టి యోగామాట్, మట్టిగణపతులు, ఖాదీ చేనేతచీరెలు వస్త్రాలు, ఉచిత దవాచాయ్ వంటివి ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయాని తెలిపారు.వీటికి గాను స్టాల్స్ కావాలసిన వారు టేబుల్, కుర్చీలు, శుభ్రత, మరియు కరెంట్ వంటి ఏర్పాట్లకోసం కేవలం 300 రూపాయలు హాల్ వారికి జమచేయవలసి ఉంటుందని తెలిపారు.మరిన్ని వివరాలకు మరియు సంతలో స్టాల్ పెట్టుదలచినవారు 91 94908 50766 లేదా 6305-182620 నెంబర్లపై ఫోన్ చేసి ముందస్తు దరఖాస్తు చేసుకుని, గ్రామ భారతి వారి సమ్మతం తప్పని సరిగా తీసుకోగలరని కోరారు.