నవతెలంగాణ – ఆర్మూర్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, చిట్టాపూర్ వాస్తవ్యులు ఏనుగు దయనంద్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని కబడ్డీ,వాలీబాల్,ఖోఖో పోటీలను గురువారం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బాల్కొండ ఉన్నత పాఠశాల పి.డి .రాజ్ కుమార్ ధన్యవాదాలు తెలిపినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి, క్రీడల అభివృద్ధికి నిర్విరామ కృషి చేయడం ఉమ్మడి జిల్లాల ప్రజల అదృష్టమని అన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని “భూదేవ్ ఇండోర్ స్టేడియం” లో క్రీడాకారుల మధ్య ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీడా నిర్వహణ,ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల విద్యార్థులకు ఎన్నో విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల వ్యాయమ ఉపాధ్యాయలు ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామపరిరక్షణ సమితి సభ్యులు ప్రతి ఒకరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.