విజయాన్నందించిన ‘మార్పు’..

– అభ్యర్థుల విజయాపజయాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర 
– మానకొండూర్ నియోజకవర్గంలో పదేండ్ల తర్వాత కాంగ్రెస్ పాగా
– కాంగ్రెస్ కు కలిసోచ్చిన సీపీఐ మద్దతు
నవతెలంగాణ-బెజ్జంకి
యువత బలిదానాలను నివారించాలనే గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుచేసి సుమారు పదేండ్లు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టడం,ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణ రాష్ట్ర ఎన్నికలపై ప్రభావం చూపిందనే అభిప్రాయలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు తీసుకున్న ‘మార్పు’నినాదం, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, రెడ్డి, బడుగు బలహీన సామాజిక వర్గాల ఓట్లు, ద్వితీయ శ్రేణి నాయకుల కృషి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటవ్వడానికి ప్రధాన అంశాలని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమిలో ద్వితీయ శ్రేణి నాయకుల వ్యవహారించిన తీరు ప్రధాన పాత్ర పోషించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో, బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమిలో ద్వితీయ శ్రేణి నాయకులే కీలకమవ్వడం విశేషం. ప్రభుత్వ ఏర్పాటుచేసి పరిపాలన చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి ప్రజాదారణను నిలుపుకోవాలని అయా పార్టీల నాయకులు సూచిస్తున్నారు.
పదేండ్ల తర్వాత కాంగ్రెస్ పాగ..
రాష్ట్రం ఇచ్చిన నుండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదోడుకులను ఎదుర్కొంటు ఎగిసిపడిన కెరటంల రాష్ట్రంలో పదేండ్ల తర్వాత  పాగ వేసి తన పూర్వ వైభవాన్ని చాటుకుంది.మానకొండూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పరిపాలనలో ఎంతో సంయమనంతో ఒడిదోడులను ఎదుర్కొంటూ మొక్కవేని పట్టుదలతో పని చేశారు.ఈ శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలనే బేదం లేకుండా సమిష్టిగా పట్టుదలతో రాత్రింబవళ్లు పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థి విజయంలో కీలకపాత్ర పోషించారు.తెలంగాణ రాష్ట్రంతో పాటు మానకొండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని కోనసాగినించనుంది.
కలిసోచ్చిన సీపీఐ మద్దతు..
రాష్ట్రంతో పాటు నియోజకవర్గాల్లోని ప్రతి మండలంలో సీపీఐ పార్టీ నాయకులు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయంలో పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ శాయశక్తుల కృషి చేశారు.అభ్యర్థుల విజయాల్లో సీపీఐ పార్టీ  ప్రధాన భూమికను పోషించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానభూమికని అ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
అమరుల త్యాగాన్ని గుర్తించిన ప్రజలు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అకాంక్షను విస్మరించి అధికారమే ప్రధాన ద్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సాగించింది.తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో శ్రీకాంతా చారి అత్మహత్యకు పాల్పడిన నవంబర్ 30న రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందిన డిసెంబర్ 3న ఎన్నికల పలితాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పి అమరుల త్యాగాలకు గుర్తింపునిచ్చారు.ప్రభుత్వంలో ‘మార్పు’ను తీసుకువచ్చిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు.