
– వినాయక్ పురంలో ఎమ్మెల్యే…
– అశ్వారావుపేట లో ఎంపీపీ
– గుమ్మడి వల్లి లో జెడ్పీటీసీ ప్రారంభం
నవతెలంగాణ – అశ్వారావుపేట
పల్స్ పోలియో చుక్కలు నమోదు మొదటి రోజు విజయ వంతం అయింది. మండల వ్యాప్తంగా వినాయక పురం,గుమ్మడి వల్లి రెండు ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో 5800 మంది అయిదు ఏండ్లు లోపు పిల్లలు ఉండగా మొదటి రోజు ఆదివారం 5495 మంది పోలియో చుక్కలు వేసారు. ఈ పోలియో చుక్కలు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వినాయకపురం,జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మి గుమ్మడి వల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో,ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి బస్టాండ్ లో ఏర్పాటు చేసిన శిబిరంలో లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు రాందాస్,దీపక్ రెడ్డి,మధుళిక,సీడీ పీఓ రోజా రాణి,ఎస్.ఒ.యు ఎ.వెంకటేశ్వరరావు,హెచ్.ఎస్ లు శ్రీనివాస్,దుర్గ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పి.హెచ్.సి. 0 – 5 పిల్లలు చుక్కలు వేసింది
వినాయక పురం 4306 4086
గుమ్మడి వల్లి 1494 1409
మొత్తం 5800 5495