గగన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మోకాలు మార్పిడి చికిత్స విజయవంతం…

నవతెలంగాణ – చండూరు
స్థానిక మున్సిపాలిటీ కేంద్రంలో గగన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రెండవసారి మోకాలు మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తయినట్లు ఆర్థోపెటిక్ డాక్టర్లు మల్లికార్జున్, ఉమా మహేష్ , అనస్తిసియ డాక్టర్ నవీన్ కుమార్, తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గగన్ మల్టీ వెస్టి హాస్పిటల్ లో, అతి తక్కువ ఖర్చుతో మున్సిపల్ పట్టణంలో ఆపరేషన్  చేయడం జరుగుతుందన్నారు. మోకాలు మార్పిడి చికిత్స అవసరం ఉన్నవాళ్లు తమ హాస్పిటల్ కి వచ్చి అతి తక్కువ ఖర్చుతో మోకాలు మార్పిడి చికిత్స చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.