నవతెలంగాణ-బంజారాహిల్స్
”అత్యంత అరుదైన జన్యు పరమైన రుగ్మత అలగిల్లీ సిండ్రోమ్. ఒక లక్ష జననాలలో సరా సరిన ఒకరికంటే తక్కువ మందికి మాత్రమే ఇది సంభవిస్తుంది. ఈ అరుదైన స్థితిలో కాలేయం లోపల బైల్ డక్ట్ (పిత్త నాళాలు) కెనాల్ సిస్టమ్ అభివృద్ధి చెందింది. దీనివల్ల కాలేయ రక్తంలో పిత్తరసం చేరి మెల్లగా కామెర్లు, తీవ్రమైన దురద తదనం తర కాలంలో కాలేయం విఫలమవుతుంది. తల్లిదండ్రుల జన్యువులలో ఎవరి జన్యువులలో అయినా రహస్యం గా ఇది ఉంటే అది పిల్లలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. చిన్నారుల ఎదుగుదలపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపు తుంది’ అని బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌కు చెందిన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ మహ్మద్ నయీమ్ తెలి పారు. బంజారా హిల్స్ కేర్ ఆస్పత్రిలో శుక్రవారం బాలునికి విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహిం చారు. శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మహ్మద్ నయీమ్ మాట్లాడుతూ.. 12 ఏండ్ల బాలుడు వరుణ్ మిత్ర, చిన్నప్పటి నుంచీ భయంకరమైన ఆరోగ్య సవాలును ఎదుర్కొన్నాడని తెలిపారు. నిరంతర కామెర్లు,ఎదుగుదల మందగించడం, తీవ్రమైన దురద,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు అనేక ఇబ్బందికరమైన లక్షణాలను వరుణ్ అదిగమించాడని.. కేర్ హాస్పిటల్స్‌లో వైద్య పురోగతిని పొందడంతో అతని జీవిత ప్రయాణం హదయపూర్వక మలుపు తీసుకుందని చెప్పారు. అతని ఊపిరితిత్తుల ధమనిలో అడ్డంకిని పరిష్కరించడానికి మొద ట్లో హార్ట్-స్టెంటింగ్ ప్రక్రియ కూడా జరగడం విశేషమ న్నారు. తమ కుమారుడి ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన చెందిన వరుణ్ తల్లిదండ్రులు కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిం చారని ఆతెలిపారు. కేర్ హాస్పిటల్స్ కాలేయ వైద్య బృందం బాలుడి ఆరోగ్యం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అతని కాలేయం, గుండెతో సహా బహుళ అవయవాలను ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన రుగ్మత అయిన ”అలగిల్లే సిండ్రోమ్‌తో”బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల ద్వారా గుర్తించామన్నారు. అతని కాలేయ పనితీరు వేగం గా క్షీణించడంతో పాటు పల్మనరీ ఆర్టరీ స్టెనోసిస్ నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు, ఉండడంతో చికిత్స కోసం వివిధ స్పెషలిటీ డాక్టర్ల కలయిక అవసరం పడిందని తెలిపా రు. వరుణ్ తల్లి తన బిడ్డ మనుగడ కోసం తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేయడంతో వరుణ్ తన జీవతాన్ని తిరిగి ప్రారంభించాడని తెలిపారు. వరుణ్ తల్లి అరుణ నగర నివాసి మాట్లాడుతూ.. మా అబ్బాయి బలహీనంగా ఉండటంతో పాటుగా బరువు బాగా తక్కువగా ఉండటం వల్ల తాము చాలా భయపడ్డా మన్నారు. సర్జరీకి అతను తట్టుకోగల డా అని భయంగా ఉండేదన్నారు. అయితే డాక్టర్లు,నర్సులు అంకిత భావంతో కూడిన సేవలతో అతనికి పునర్జన్మ ఇచ్చారని కామెర్ల బారిన పడకుండా ఉండటం ఓ అద్భుతం అన్నారు. అతని జీవితంలో తొలిసారిగా అతను దురదలు లేకుండా సాధార ణంగా ఉండగలిగాడని తెలిపారు. ఆస్పత్రి సీఓఓ సయెద్ కమ్రాన్ మాట్లాడుతూ అతి బలహీ నమైన, సున్నితమైన చిన్నారికి అత్యంత క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడానికి తమ మల్టీ డిసిప్లీనరీ బందం విజయవంతమైన నైపుణ్యాలు, కేర్ ఆస్పత్రి వద్ద ఉన్న అత్యాధునిక సదుపా యాలకు ఉదాహరణగా నిలుస్తాయని చెప్పారు. ఎంఎస్ డాక్టర్ అజిత్ సింగ్, అనేస్తాసియా విభాగ డాక్టర్లు,ఇతర వైద్య సిబంది, నర్సులు,తదితరులు పాల్గొన్నారు.