మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులందరికీ ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను ఆదివారం నిర్వహించారు. ‘మా’ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌ను జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ హెల్త్ చెకప్‌లో ‘మా’ సభ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ,’డా.శాస్త్రి, జీవీకే హెల్త్ హబ్‌కు థ్యాంక్స్. ‘మా’ సభ్యులం దరికీ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి హెల్త్ క్యాంప్ ప్రారంభమైంది. వేల ఖర్చుతో కూడుకున్న ఈ హెల్త్ చెకప్‌ను ఫ్రీగా అందిస్తున్నందుకు థ్యాంక్స్. ఇది ఇకపై ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. మాదాల రవి మాట్లాడుతూ, ‘జీవీకే హెల్త్ హబ్‌తో కలిసి మాస్టర్ హెల్త్ చెకప్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. ఇది ‘మా ఆధ్వర్యంలో నాలుగో హెల్త్ క్యాంప్. ‘మా’ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం కోసం హెల్త్ కార్డ్‌లను జారీ చేశాం. వాటిని అందరూ వినియోగించుకోవాలి’ అని అన్నారు. ”మా’ ఆధ్వర్యంలో ఇది నాలుగో ఫ్రీ హెల్త్ క్యాంప్. జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది’ అని శివ బాలాజీ చెప్పారు. డా|| శాస్త్రి మాట్లాడుతూ, ‘ఈ రోజు వరల్డ్ హార్ట్ డే. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నిరోధించాలి. డైట్, హెల్త్ పట్ల అందరూ అవగాహనతో ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆర్టిస్టులకి ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. అందుకే వీరి కోసం స్పెషల్‌గా మాస్టర్ చెకప్ చేస్తున్నాం’ అని తెలిపారు.