విజయవంతంగా ముగిసిన అంతర్ కళాశాలల క్రీడలు

నవతెలంగాణ – అశ్వారావుపేట : స్థానిక వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం స్థాయిలో జరుగుతున్న అంతర్ కళాశాల స్థాయి క్రీడా పోటీలు గురువారం విజయవంతంగా ముగిశాయి. క్రీడల జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగాయి. బాలురు విభాగం క్రికెట్ పోటీల్లో రాజేంద్ర నగర్ కళాశాల ప్రధమ, జగిత్యాల కళాశాల ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. బాస్కెట్ బాల్ పోటీల్లో రాజేంద్ర నగర్ కళాశాల జట్టు ఆశ్వారావుపేట కళాశాల ద్వితీయ స్థానాలు విజయం సాధించాయి. వాలీబాల్ పోటీల్లో పాలెం కళాశాల ప్రధమ,రాజేంద్ర నగర్ కళాశాల జట్టు ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నాయి.షటిల్ పోటీలో నగర్,పాలెం వ్యవసాయ కళాశాలల జట్లు ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. టేబుల్ టెన్నీస్ లో అశ్వారావుపేట కళాశాల జట్టు ప్రధమ,రాజేంద్రనగర్ కళాశాల ద్వితీయ స్థానాల్లో నిలిచాయి .క్యారమ్స్ లో అశ్వారావుపేట,వరంగల్ కళాశాలల జట్లు ప్రధమ, ద్వితీయ బహుమతులు గెలుపొందాయి చెస్ పోటీల్లో అశ్వారావుపేట,రాజేంద్ర నగర్ కళాశాలల జట్లు ప్రధమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి.ఫుట్ బాల్ పోటీలో రాజేంద్ర నగర్, జగిత్యాల జట్లు, బాల్ బ్యాట్మింటన్ పోటీల్లో రాజేంద్ర నగర్,సంగారెడ్డి కళాశాలల ఇట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.
బాలికల విభాగం వాలీబాల్ పోటీల్లో రాజేంద్ర నగర్, జగిత్యాల కళాశాలల ఇట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుపొందాయి. బాస్కెట్ బాల్ పోటీల్లో జగిత్యాల,రాజేంద్ర నగర్ కళాశాలలు ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. షటిల్ పోటీల్లో రాజేంద్ర నగర్, పాలెం కళాశాలల జట్టు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజయం సాధించాయి. టెన్నీకాయిట్ లో అశ్వారావుపేట, సైఫాబాద్ కళాశాలల ఇట్లు గెలుపొందాయి. క్యారమ్స్ (డబుల్స్)లో రాజేంద్ర నగర్, సైఫాబాద్ కళాశాలల జట్లు గెలుపొందాయి.టేబుల్ టెన్నీస్ పోటీల్లో అశ్వారావుపేట, జగిత్యాల కళాశాలల జట్టు విజయం సాధించాయి. బాల్ బ్యాట్లింటన్ పోటీల్లో సైపాబాద్, సిరిసిల్ల కళాశాలలు గెలుపొందాయి. చెస్ పోటీల్లో జగిత్యాల,అశ్వారావుపేట కళాశాలలు ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.
బాలికల విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో జగిత్యాల,అశ్వారావుపేట పాలెం కళాశాలల విద్యార్థినీ లు సుష్మా ప్రియాంక, ఎం.దచన, వై శ్రీ వర్ష లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జావెలిన్ త్రో పోటీల్లో జగిత్యాల, అశ్వారావుపేట, వరంగల్ విద్యార్ధినీ లు అక్షయ రెడ్డి, ఎస్. కావ్య శ్రీ, జి. కావేరి లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుపొందారు. లాంగ్ జంప్ లో జగిత్యాల,పాలెం,జగిత్యాల కళాశాలల విద్యార్థినీ లు ఎస్.అక్షయ రెడ్డి, వై.శ్రీవర్ష,ఎన్. వైష్ణవి,400 మీటర్ల పరుగు పందెంలో సంగారెడ్డి, సైఫాబాద్, రాజేంద్ర నగర్ కళాశాలల విద్యార్థినీ లు బి.హర్షిత, టి హారిక, టి. వైష్ణవి షాట్ ఫుట్ లో సైఫాబాద్, అశ్వారావుపేట,జగిత్యాల విద్యార్థినీ లు ఎం. రాజేశ్వరీ, సుష్మా ప్రియాంక, డి.మేఘన, 200 మీటర్ల పరుగు పందెంలో బి.హర్ష, ఎస్. కావ్య శ్రీ పీహెచ్ సుష్మా యాలక, డిస్క్ త్రో లో అక్షయ రెడ్డి, జి.కావేరి, బి.రమ్య, హైజంప్ లో జి.మౌనిక, సీహెచ్, సుష్మా ప్రియాంక, ఎస్. కావ్య శ్రీ లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
బాలురు విభాగంలో షాట్ ఫుట్ లో ఎండ్.
ఖైఫ్, కేఆర్ మారుతి, ఎన్. మహేష్,3000 మీటర్ల పరుగు పందెంలో బి.బాలకృష్ణ, విజయ్ కుమార్,వంశీ లు, 400 మీటర్లలో బి.బాలకృష్ణ, ప్రిన్స్ రాజ్, కె.అనీల్ కుమార్, ట్రిపుల్ జంప్ లో కె. యోగేష్, ఎస్. అనీల్, 100 మీటర్ల పందెంలో కె.యోగేష్, బి. బాలకృష్ణ, ప్రిన్స్ రాజు లు, డిస్కస్ త్రో మారుతి, టి.మహేష్, పి. కార్తిక్, లాంగ్ జంప్ లో ప్రశాంత్, యోగేష్, చత్రపతి, 1500 మీ పందెంలో బి. బాలకృష్ణ, జి.శ్రావణ్. ఎం. లక్ష్మీ నరసింహా, జావెలిన్ త్రో రాహుల్ గౌడ్, జె.సతీష్, జి. నితిన్ రెడ్డి, 800 మీటర్ల పందెంలో బి. బాలకృష్ణ, శ్రావణ్ కుమార్, జి.శ్రావణ్, 200 మీటర్ల పందెం లో కె. యోగేష్, కృష్ణ కార్తికేయ, ప్రిన్స్ రాజు, హైజంప్ లో కృష్ణ కార్తికేయ, అనీఫ్, శివ కుమార్ మొదటి మూడు స్థానాల్లో గెలుపొందారు.