– సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
నవతెలంగాణ – కరీంనగర్
ప్రజల అవసరాలకనుకూలంగా అభివృద్ధికి సుడా నిధులు వెచ్చిస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఇరవై రెండవ డివిజన్ పరిధిలోని శివాలయం పక్కన మహిళా సమాఖ్య భవనానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ సుడా వైస్ చైర్మన్ ప్రవుల్ దేశాయ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. డివిజన్ లోని పద్నాలుగు వందల మంది మహిళా సమాఖ్య గ్రూపుల మహిళలకు ఉపయోగపడే విధంగా స్థానిక కార్పొరేటర్ గంట కల్యాణి శ్రీనివాస్ స్థానిక నాయకులు దండి రవీందర్,ముల్కల కవిత సమాఖ్య గ్రూపుల విజ్ఞాపన మేరకు ప్రస్తుతం పది లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందని అవి సరిపోకపోతే మరిన్ని నిధులు వెచ్చించయినా భవన నిర్మాణం పూర్తి చేసి అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ రాజేంద్ర ప్రసాద్,ఏఈ రమేష్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,సమైఖ్య సంఘాల అధ్యక్షులు జానం పేట అంజలి,హజీరా సుల్తానా,రౌతు లలిత, రాచూరి స్రవంతి,సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.