నవతెలంగాణ -బీబీనగర్
ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షునిగా మండలంలోని వెంకిర్యాల గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ అరిగే సుదర్శన్ మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షులు కొలుపుల హరినాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సందర్భంగా అరిగే సుదర్శనకు నియామక పత్రాన్ని అందజేసినట్టు తెలిపారు, సందర్భంగా కుల పెద్దలందరికీ కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ, లక్కారం మాజీ సర్పంచ్ మచ్చ పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పాశం సంజరు, బాబు, సత్యనారాయణ, విజరు కుమార్ స్థానిక నాయకులు గణేష్, కనకబోయిన గోపాల్, ప్రేమ్ కుమార్, గంగాధర్ శంకరయ్య, పెంటయ్య, నరసింహ, ఆరుముళ్ళ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.