
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో శుక్రవారం మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకేట రవి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ, ప్రజల తరఫున సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, నాయకులు ఊట్నూరి ప్రదీప్, బుచ్చి మల్లయ్య, దూలూరు కిషన్ గౌడ్, సల్లూరి గణేష్ గౌడ్, అజ్మత్ హుస్సేన్, మోహన్ నాయక్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.