నవతెలంగాణ – పెద్దవంగర: మండలంలోని పెద్దవంగర, అవుతాపురం, పోచంపల్లి గ్రామాల్లో ఏడీఏ విజయ్ చంద్ర, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ తో కలిసి పర్యటించారు. ఆయా గ్రామాల్లోని ఫర్టలైజర్ షాపులను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు రికార్డులను, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పురుగు మందుల నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని డీలర్ల కు సూచించారు. ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువుల విక్రయాలు కొనసాగించాలన్నారు. ఏఈవోలు అందుబాటులో ఉండి, రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలన్నారు.