ఫోటో జర్నలిస్ట్‌ రాజేష్‌ ఆకస్మిక మృతి బాధాకరం

ఫోటో జర్నలిస్ట్‌ రాజేష్‌ ఆకస్మిక మృతి బాధాకరం– తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యువ ఫోటో జర్నలిస్ట్‌ నర్రా రాజేష్‌ (41) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనుమళ్ల గంగాధర్‌, కె ఎన్‌ హరి శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేవారు. వృత్తిలో నిబద్దత కలిగిన నర్రా రాజేష్‌ హఠాన్మరణాన్ని ఫోటో జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాల చిత్రాలను తన కెమెరాలో ఆయన బందించాడనీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి యాదయ్య ఆత్మాహుతి ఘటన ఫోటోలు నర్రా రాజేష్‌ ఒక్కడే తీసి ప్రపంచానికి తెలియజేశాడని గుర్తు చేశారు. రాజేష్‌ మరణం పట్ల వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.