
మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం విక్రయించే కేంద్రాలలో తెచ్చిపోసినా పంటలు వర్షంతో కొట్టుకుపోయాయి. కొన్ని గ్రామాలలో రోడ్డుపై వరి ధాన్యంతో పాటు జొన్నలు వేశారు. రాత్రి వర్షం రావడంతో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. జొన్న పంట కోసి వారాలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వము జొన్న కంటలను ఏర్పాటు చేయకపోవడంతోనే జొన్న పంట వర్షం పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జొన్న కంట ముందస్తుగా ఏర్పాటు చేసినట్లయితే ఇప్పటివరకు జొన్నలు కాంట అయ్యేవయని రైతు ఇంట్లో ఆశలు చిగురించేవని రైతులు కంట నీరు పెడుతున్నారు.దేవుడు కరుణించకపోయినా ప్రభుత్వం కరుణించి ఉంటే రైతులకు ఇంత ఆవేదన ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.అకాల వర్షానికి ఇటు జొన్న అటు వరి రైతులను ముంచేశాయని లబోదిబోమంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కొనుగోలు అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోయారని అంటున్నారు.సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు కలెక్టర్ చెప్పగానే ప్రారంభించారు.వరి ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడం అదే సమయంలో అకాల వర్షాలు కురిసి చేతికొచ్చిన పంట తడిసి ముద్దయిందన్నారు. ప్రభుత్వాలు మారినా రైతుల బ్రతుకులు మారడం లేదని,ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారుల యంత్రాంగము స్పందించి పంట నష్టపరిహారము సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని రైతుల కోరారు.