బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా సుధాకర్ పటేల్ పెద్ద ఎక్లారా

– నూతన అధ్యక్షునికి సన్మానించిన పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్

నవతెలంగాణ -మద్నూర్
మద్నూర్ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా సుధాకర్ పటేల్ పెద్ద ఎక్లారా ఎన్నికయ్యారు మంగళవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో సమావేశమైన నాయకులు కార్యకర్తలు సుధాకర్ పటేల్ న మండల యూత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన యూత్ అధ్యక్షులు సుధాకర్ పటేల్ కు మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ శాలువాతో ఘనంగా సత్కరించారు యూత్ అధ్యక్షులుగా సుధాకర్ పటేల్ ఎంపిక కావడం పార్టీ యూత్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు పార్టీ బలోపే దానికి సుధాకర్ పటేల్ కృషి ప్రత్యేకంగా ఉంటుందని పలువురు నాయకులు అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మద్నూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షులు షేక్ గఫర్ ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్ పార్టీ సీనియర్ నాయకులు సోమూర్ సర్పంచ్ కుటుంబ సభ్యులు కాబోయే మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ కాశీనాథ్ పటేల్ మద్నూర్ మాజీ సొసైటీ చైర్మన్లు పాకల విజయ్ పండిత్రావు పటేల్ వీరితోపాటు మండల ప్రచార కార్యదర్శి రచ్చ కుశాల్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.