ఓటు హక్కు వజ్రాయుధం.. 

– కమ్యూనికేషన్ అధికారి ధర్మ నాయక్
నవతెలగాణ- నసురుల్లాబాద్: భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు ఒక వజ్రాయుధమని ఆర్డీవో మహేందర్జీ పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడ డివిజన్ పరిధిలోని దుర్కి ఎస్ఆర్ఎన్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్డీవో బుజంగ్ రావు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మ నాయక్ హాజరయ్యారు. యువతి, యువకులకు, ఉద్యోగులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ధర్మ నాయక్ మాట్లాడుతూ యువతి, యువకులకు ఓటు హక్కు దేశ సంక్షేమానికి అభివృద్ధికి పునాది లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానంలో ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు హక్కు అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకో వాలన్నారు. అన్ని గ్రామాల్లో యువతి యువకులు ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యత- వినియోగించుకునే విదానాలపై అవగాహన కల్పించాలని సూచంచారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ శ్రీమతి శైలీ బెల్లాల్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్, నోడల్ ఆఫీసర్ జనార్ధన్, మున్సిపల్ అధికారి మల్లికార్జున్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పి శ్రీనివాస్, కృష్ణ, జి సుధాకర్ రెడ్డి, మనోహర్, ఇతర జిల్లా శాఖ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.