ఓటుహక్కు ఒక వజ్రాయుధం లాంటిది

ఓటుహక్కు ఒక వజ్రాయుధం లాంటిది– ఓటు ప్రాముఖ్యతపై టీం వన్ కళాజాత బృందంతో అవగాహన
నవతెలంగాణ:మల్హర్ రావు:-
ఓటుహక్కును సామాన్యులకు ఒక వజ్రాయుధం లాంటిదని దీనిని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలంటూ కళాజాత బృందాల ద్వారా ప్రభుత్వం ఓటుహక్కు ప్రాముఖ్యతపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంథనిలోని నాగారం గ్రామంలో పెద్దపల్లి టీం వన్ పోగ్రామ్ కళాజాత బృందం సభ్యులు సలేంద్ర రాజన్న యాదవ్,రాజనర్సు,ఉదునూరి పద్మ,కొండ్ర వెంకన్న,బుర్ర శంకర్,శ్రావణ్ తదితర కళాకారులు ఓటుహక్కు దాని ప్రాముఖ్యతపై అవగాహన నిర్వహించారు.పలువురు నాయకులు ప్రలోభాలకు గురి చేస్తే తలొగ్గకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సేవకుడిలా సేవలందించే మంచి నాయకుడిని ఎన్నోకోవడానికి తమ ఓటుహక్కును వినియోగించుకోవాలంటూ ఆటపాటలతో వివరించారు.