ఉరివేసుకొని ఆత్మహత్య

నవతెలంగాణ-భిక్కనూర్:
మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఉరి వేసుకొని యువకుడు మరణించిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నిశాంత్ (23) ఆటో డ్రైవర్, వ్యవసాయం చేస్తు జీవిస్తున్నాడు. తన తమ్ముడు నితిన్ దొంగలను కేసులో జైలుకు వెళ్లాడు. గత 15 రోజుల నుండి తమ్ముడు జైలుకు వెళ్లాడని బాధపడుతూ మానసికంగా కృంగిపోయి బుధవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయి రాత్రి ఇంటికి రాకపోయేసరికి గురువారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా వ్యవసాయ బావి వద్ద వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.