నవతెలంగాణ – అశ్వారావుపేట
ఒంటరిగా ఉంటున్న ఓ వివాహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని సోదరుడు గుళ్ళ నాగు ఇచ్చిన రాతపూర్వక పిర్యాదు మేరకు ఎస్.ఐ శివరాం క్రిష్ణ తెలిపిన వివరాలు ప్రకారం… మండల పరిధిలోని నారం వారి గూడెంకు చెందిన గుళ్ళ లక్ష్మణ్ రావు (25) వివాహితుడు. ఈయనకు భార్య సుధారాణి, ఇరువురు సంతానం ఉన్నారు. ఈయన మద్యానికి బానిసై కావడంతో భార్య భర్త వేర్వేరుగా ఉంటున్నారు.ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.శుక్రవారం అతని సోదరుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.