అనుమాదాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి చెందిన ఒ వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడాడు. సిఐ రమేష్ తెలిపిన ప్రకారం ఉట్కూరు కరుణాకర్ గౌడ్ వివాహితుడు, వయస్సు 30, వృత్తి డ్రైవర్, సొంత గ్రామంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపారు. ఇతని మీద  రౌడీషీట్ ఓపెన్ అయి ఉన్నది. 2017 కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పీడియాక్ట్ కూడా నమోదు అయి ఉన్నది. గత పది రోజుల నుండి అటెం టు మర్డర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లో అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.