అశ్వారావుపేట మున్సిపాల్టీ ఎఫ్.ఏ.సీ( అదనపు పూర్తి బాధ్యతలు) కమీషనర్ గా సుజాత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నేరుగా ఆమె తాత్కాలిక పంచాయితీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పంచాయితీ కార్యదర్శి కోటమర్తి శ్రీరామ మూర్తి సహా సిబ్బంది పుష్పగుచ్చం తో స్వాగతం పలికారు. అక్కడ నుండి నూతనంగా నిర్మించిన పూర్వ పంచాయితీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడేఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఈవో సోయం ప్రసాద్ రావు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం అయ్యారు. అనంతరం మున్సిపాల్టీలో విలీనం అయిన గుర్రాల చెరువు, పేరాయిగూడెం పంచాయితీలు ను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు విలేఖర్లతో మాట్లాడుతూ.. తక్షణమే మూడు పంచాయితీలకు చెందిన పరిపాలనా పరం అయిన రికార్డులు, చెక్కు బుక్స్, తీర్మానాలు పుస్తకాలు, ఎకౌంట్ బుక్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.