సొంత గూటికి చేరిన సుమలత సుధాకర్‌

నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఘర్‌ వాపస్‌ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌ నుండి తిరిగి స్వంత పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీ లోని చేరాఉ. తిరుమలగిరి మున్సిపాలిటీ 14వ వార్డు కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి పత్తేపురం సుమలత- సుధాకర్‌ దంపతులు. వారిని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్‌, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్‌, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం లో బి ఆర్‌ ఎస్‌ పార్టీ అరాచకపు పాలనకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. తుంగతుర్తి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గా ఎవరొచ్చినా పార్టీ గెలుపుకు కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ గుగులోతు భాస్కర్‌, నాయకులు విశ్వేశ్వర్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు కంబాల రాకేష్‌, రసీదు, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ కొత్తపల్లి ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.