వైద్య వృత్తి ఎంతో విశిష్టమైనది: సుమన్ మోహన్ రావు

– జిల్లా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
నవతెలంగాణ – సిరిసిల్ల
రోగులకు సేవ చేసే గుణం ఒక్క వైద్యులకు మాత్రమే ఉంటుందని వైద్య వృత్తి ఎంతో విశిష్టమైనదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు కొనియాడారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో జిల్లా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ సుమన్మోహన్ రావు మాట్లాడుతూ.. సమాజంలో వైద్యులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా, ప్రపంచంలోనే అత్యంత గొప్ప వైద్యులు, బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బీదన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం, ఆయన అందించిన సేవలకు గుర్తుగా తన జయంతి, వర్ధంతి సందర్భంగా  జులై 1న  నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నట్లు తెలిపారు. సేవ అందించే గుణం ఒక్క వైద్యులకే ఉంటుందని, ప్రైవేటు వైద్యులు జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రమేష్ డాక్టర్ జైల్ సింగ్ డాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ సురసుర రాధాకృష్ణ మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.