వేసవి కానుకగా విడుదల

A summer releaseవిష్ణు మంచు నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్‌, 24 ఫ్రేమ్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్‌ పాత్ర తాలూకా పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఆగ్రహంతో శివ తాండవం చేస్తున్నట్టుగా ఉన్న అక్షరుకుమార్‌ పోస్టర్‌లో అందరిలోనూ అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఇలాంటి ఓ అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, శివుని ఆశీస్సులతో ఆడియెన్స్‌ ముందుకు ఏప్రిల్‌ 25న రాబోతున్నాం’ అని అక్షరు కుమార్‌ చెప్పారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, ప్రభాస్‌, మోహన్‌ బాబు, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం, కాజల్‌ అగర్వాల్‌, ప్రీతి ముకుందన్‌ వంటి తదితర భారీ తారాగణం నటించింది. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు.