
రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపికయ్యే విధంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి ముత్తెన్న అన్నారు. మండలంలోని మాదాపూర్ పాఠశాలలో వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ముత్తెన్న జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వాలీబాల్ కోచింగ్ క్యాంపు లో భాగంగా నేడు యువజన మరియు క్రీడా అధికారి ముత్తెన్న ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు వాలీబాల్లు, వాలీబాల్ నెట్లు అందించడం జరిగింది. శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారిణి క్రీడాకారులతో మాట్లాడుతూ.. సమ్మర్ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపికయ్యే విధంగా మెళకువలు నేర్చుకోవాలని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ వెంకటేష్ గౌడ్ విజేత యూత్ సభ్యులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.