నేటి నుంచి జూన్ 5 వరకు వేసవి నృత్య శిక్షణ శిబిరం

నవతెలంగాణ – ఆర్మూర్

పట్టణం లోని నటరాజ నృత్య నికేతన్ ఆధ్వర్యంలో నేటి నుండి జూన్ 5 వరకు  సమ్మర్ క్యాంప్ ద్వారా నృత్య శిక్షణ శిబిరం  నిర్వహిస్తున్నట్టు నాట్య గురువు  బాశేట్టి మృణాళిని బుధవారం తెలిపారు .ఈ శిక్షణ శిబిరంలో శాస్త్రీయ నృత్య విభాగంలో ఆంధ్రనాట్యం,పేరిణి ,కూచిపూడి, మరియు జానపద నృత్యం, శ్లోకాలు నేర్పడంలో శిక్షణ ఇస్తామని తెలియజేశారు. ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు ఈ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొనడం ద్వారా మానసిక వికాసాన్ని, సంపూర్ణ  ఆరోగ్యాన్ని  పొందగలుగుతారని అన్నారు. పట్టణంలోని గంగ హాస్పిటల్ ప్రక్కన 9550761678 నంబర్ కు సంప్రదించవచ్చని తెలిపారు.