
మండలంలోని బిఎల్వో లతో జుక్కల్ ఎమ్మార్వో గంగాసాగర్ శుక్రవారం నాడు ప్రత్యెకంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగా సమ్మర్ రివిజన్ సమావేశం ఎంపిడివో సమావేశ హలులో నిర్వహించారు. ఈ సంధర్భంగా బిఎల్వో లకు పలు సూచనలు చేసారు. మెుదటగా గ్రామాలలో నూతనంగా అర్హులైన వారికి ఓటరు నమేాదును ప్రారంబించాలని, చనిపోయిన వారి ఓట్లను తీసీవేయాలని , అనంతరం నిరంతరంగా గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఓటరు నమేాదు, ఓటు హక్కు విలువలను ప్రజలకు అవగాహన చేయాలని బీఎల్వోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ , డిప్యూటి తహసీల్దార్ జ్యోతి, గిర్దావర్ రామ్ పటేల్ , వివిధ గ్రామాల బిఎల్వోలు తదితరులు పాల్గోన్నారు.