నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని వడ్లూర్ బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రేపు సాప్ట్ బాల్ వేసవి క్రీడాశిక్షణ శిభిరాన్ని ప్రారంభిస్తున్నట్టు శిక్షణ శిబిర ఇంచార్జ్ వెగ్గలం సతీష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుండి 31 వరకు ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరం ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నామని ఆసక్తిగల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సతీష్ కుమార్ సూచించారు.