గిరిజన సంక్షేమ పాఠశాలలో సమ్మర్ స్ప్రీ క్యాంప్..

నవతెలంగాణ-ఏటూరు నాగారం: గురుకుల పాఠశాల విద్యార్ధులు ప్రతి ఒక్కరూ సంక్షేమ పాఠశాలల రూపకర్త ఎస్. ఆర్. శంకరన్ ను స్మరించుకోవాలని సీనియర్ సంపాదకులు సతీష్ చందర్ అన్నారు. నగరంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో సమ్మర్ స్ప్రీ క్యాంప్ 2024 లో యంగ్ జర్నలిస్ట్స్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న ఆయన విద్యార్థులనుద్ధేశించి మాట్లాడుతూ… జ్ఞాన సమూపార్జనలో తృప్తిని, ఆనందం పొందాలన్నారు. దేశంలోనే కేరీర్ గా ఎంచుకునే వృత్తులలో మూడో స్థానంలో జర్నలిజం వుందని అన్నారు. జర్నలిజమే కాదు, ఏ వృత్తి ఏంచుకున్న అందులో ఆనందాన్ని పొందలని అన్నారు. ఏపీ కాలేజీ ఆప్ జర్నలిజం డైరెక్టర్ కిషన్ చందర్ మాట్లాడుతూ… ఏపీ కాలేజీ ఆప్ జర్నలిజం దేశంలేనే టాప్ కళాశాలలో ఒక్కటి అని, సౌత్ ఇండియా లో టాప్ టెన్ లో వుందని, తెలుగు రాష్ట్రాలలో నెంబర్ వన్ స్థానంలో వుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకులాల (బాలురు మరియు బాలికల) పాఠశాలల ప్రిన్సిపాల్ లు రాజ రామ్ మరియు వసుంధర యంగ్ జర్నలిజం క్యాంప్ ఇంచార్జ్ అమర్ నాథ్, హను, ఇతర నాలెడ్జ్ పార్టనర్ లుగా మౌనిక, శ్వేత, హరీష్, సుమన్, ప్రవళిక, పవిత్ర లతో పాటుగా గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్, ఇతర టీచింగ్ ఫాకల్టీ పాల్గోన్నారు.