కామ్రేడ్ సుందరయ్య ఇన్ని విజయాలు సాధించగలిగారంటే ఆయనలో కొన్ని ప్రత్యేక సుగుణాలుండటమే దానికి కారణం. ఆయన అంకిత భావం, ప్రజలలో ఒకరుగా కలిసిపోగల ఆయన స్వభావం. బహుశా జనబాహుళ్యంలో అంతగా కలిసిపోయినవారు భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు)లో ఒక్క ఎ.కె.గోపాలన్ తప్ప మరెవ్వరూ లేరు. వీరిద్దరూ ప్రజల తరుపు మనుషులుగా, ప్రజల యొక్క మనుషులుగా, ప్రజల కోసం నిలిచే మనుషులుగా ఎప్పుడూ జనబాహుళ్యంలోనే ఉండేవారు. ప్రజలతో అందులోనూ అట్టడుగు వర్గాలలో సజీవ సంబంధాలు కలిగివుండటం, ఎప్పుడూ పార్టీ సభ్యులకు, కార్యకర్తలందరికి అందుబాటులో ఉండ
టం, నిరాడంబర జీవితం వీటన్నిటి కారణంగానే సుందరయ్య పార్టీకి నూతన విజయాలు చేకూర్చగలిగాడు. కామ్రేడ్ పిఎస్ ఒక సంపన్నమైన జీవితం గడిపాడు. ధనసంపదలు సుఖ బోగాలలో గాక సిద్ధాంత బలం, ప్రజల ప్రేమాభిమానాలు పొందడంలో, పార్టీ కోసం చేయవలసిందంతా చేశామనే సంతృప్తి పొందడంలో ఆయన సంపన్నుడు. ఈ విధమైన సంపన్నత చాలా కొద్ది మందికే వుంటుంది. ఆయన స్మృతి మనలో చిరకాలం నిలిచివుండి మనందరం పార్టీ కోసం పనిచేసే విధంగా ప్రేరణనిచ్చును. కామ్రేడ్ పిఎస్ 55 ఏళ్లపాటు కమ్యూనిస్టుగా జీవించారు. కృషి చేశారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా ఆయన ఎప్పటికి గుర్తుండిపోతారు . అందించిన నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మహాత్తర అధ్యయనంగా నిలిచిపోతుంది. కామ్రేడ్ సుందరయ్య కమ్యూనిస్టులందరికి ఆదర్శంగా ఉంటారు.
– కామ్రేడ్ బి.టి.రణదివే