
నవతెలంగాణ – భువనగిరి
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు జి రఘుపాల్ అన్నారు. ఆదివారం సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సుందరయ్య జీవిత విశేషాలు అనే అంశంపై స్మారక ఉపన్యాసం చేస్తూ దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో సుందరయ్య పాత్ర గొప్పదని నాడు భూమి, బుక్తి, విముక్తి వెట్టి చాకిరి కోసం చేసిన పోరాటంలో పేద ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటూ లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్రకు నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి సుందరయ్య అని వారు అన్నారు. కులం, మతం మీద ప్రజలను చైతన్యం చేసి ప్రజా పోరాటాలు నడిపిన మహా నేత అని వారు కొనియాడారు. ప్రస్తుతం పాలక ప్రభుత్వాలు మహనీయుల చరిత్రను కనుమరుగు చేసి దేశానికి ఉపయోగం లేని చరిత్రలను పాఠ్యపుస్తకాలలో పెట్టి తప్పుడు చరిత్రను సమాజానికి నేటి యువతకు అందిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శప్రాయంగా తీసుకొని ప్రజా పోరాటాలను నిర్మించి ప్రజలలో జీవించాలని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరు మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్, నాయకులు గద్దె నరసింహ, అన్నంపట్ల కృష్ణ, బోడ భాగ్య, చింతల శివ,లావుడియా రాజు, ఈర్లపల్లి ముత్యాలు, వడ్డెబోయిన వెంకటేష్, గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, ఓవల్దాస్ అంజయ్య, లావుడియా సరిత, గడ్డం వాణి, పాల్గొన్నారు.