నవతెలంగాణ – ఆర్మూర్
సుందరయ్య 39వ వర్ధంతి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రి నగర్ లో గల సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ , పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ..పుచ్చలపల్లి సుందరయ్య (1913 – 1985) 1985 మే 19వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన జీవించిన కాలమంతా సమాజానికి మార్గదర్శకంగా నిలిచారు. నాటి కాలంలో రాజకీయాల్లో ఒక కొత్త మార్గాన్ని చూపారు. తన సొంత భూమిని పేదలకు పంచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఏకైక వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, దోపిడీ అన్యాయాలకు వ్యతిరేకంగా సామాజిక వర్గ ఉద్యమాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జల విధానాన్ని, మార్గాన్ని ఆనాడు చట్టసభల్లోప్రసంగించిన వ్యక్తికామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన ఆశయ సాధన కోసంమనమందరముకంకణ బద్దులు కావాలంటే అన్నారు. రాజకీయ నాయకుడంటే ఎలా ఉండాలో ఒక నమూనాగా నిలిచారు. భారత దేశంలో దోపిడీ, అసమానతలు లేని సమ సమాజాన్ని నిర్మించాలని కలలు కన్నారు. అందుకోసం తన యావజ్జీవితాన్ని అంకితం చేశారు. దేశంలో పేదవాళ్ళు అందరూ నా పిల్లలుగా భావించి తన ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని లీలావతిని పెళ్లి చేసుకున్నాడని అన్నారు కానీ నేటి పాలకులు ప్రజలకు కనీసం ఉపయోగపడే కూడు గుడ్డ నీడ ఇవ్వటంలో ఫెయిల్ అయ్యారని పేదలు ఉండటానికి 1 20 గజాల స్థలం ఇవ్వాలని వాటి సాధన కోసం సుందరయ్య స్ఫూర్తితో ముందుకు కొనసాగుతామని సుందరయ్య గారు పేదల గుండెల్లో ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు కొండ గంగాధర్, భామండ్ల రవి, టీ భూమన్న , సాయిలు అజిత్ ఖాన్ కుల్దీప్ శర్మ కల్లుబాయి గంగమని, ఖలీల్ హసీనా, పద్మ రిజ్వానా బేగం, అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.