మోపాల్ మండలంలోని తానాకుర్ధి గ్రామం తో పాటు వివిధ గ్రామాలలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వరి నాట్లు ప్రారంభమయ్యాయి. గత 15 రోజుల నుండి మండలంలోని రైతులందరూ ఆకాశం వైపు చూస్తు దేవుని ప్రార్థించారు. ఏట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో 15 రోజుల నుండి వేచి చూస్తున్నా రైతుల కళ్ళల్లో ఆనందం వెలుగుపడి వరి నాట్లు జోరు అందుకున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు పనిలేక తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో వర్షం కురవటంతో వారికి మరి కొన్ని రోజులు ఉపాధి దొరికింది.