హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌తో నూతన ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు ఐటిసికి చెందిన సన్‌ఫీస్ట్ వెల్లడించింది. భోజనం తర్వాత స్వీట్స్, డెసర్ట్‌లను తరచుగా తీసుకుంటున్నట్టు గుర్తించిన నేపథ్యంలో ‘హర్ టిఫిన్ కి స్వీట్ ఎండింగ్’ నినాదంతో ఈ ప్రచారాన్ని ఎంచుకున్నట్లు పేర్కొంది. చాలా మంది భారతీయుల్లాగానే తాను కూడా టిఫిన్‌లో తియ్యదనం అంటే ఇష్టపడతానని షారుక్ తెలిపారు. అలాగే తన టిఫిన్‌లో తనకు ఎంతో ఇష్టమైన సన్ ఫీస్ట్ డార్క్ ఫాంటసీ కుకీలను వెంట తీసుకెళ్తానని పేర్కొన్నారు.